యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్‌లో పెరిగిన తీవ్రవాదుల సురక్షిత స్థావరాలు: అమెరికా
వాషింగ్టన్ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 11:11 IST )
తీవ్రవాదానికి అడ్డుకట్టే వేసేందుకు పాకిస్థాన్ ఆశించినస్థాయిలో స్పందించడం లేదని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్ఘాన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులపై గత కొన్నేళ్లుగా పోరు జరుపుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్- ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో తీవ్రవాదులు తలదాచుకుంటున్నారు.

పాక్ భూభాగంలో ఉన్న కారణంగా సంకీర్ణ సేనలు వీరిపై దాడులు చేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ తమ భూభాగంలోకి విదేశీ సేనలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా సైనిక దళాల చీఫ్ మైక్ ముల్లెన్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో తీవ్రవాదులకు సురక్షిత స్థావరాలు బాగా విస్తరించాయని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియన్ ప్రావీన్స్‌లోని ఈ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను తీవ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పారు. తీవ్రవాద గ్రూపులపై ఒత్తిడి తెచ్చేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాకుండా ఆఫ్ఘానిస్థాన్‌లో తమ దళాల సంఖ్యను పెంచాలనుకుంటున్నట్టు ముల్లెన్ సూచనప్రాయంగా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎన్‌‍‌డబ్ల్యూఎఫ్‌పీలోకి పాక్ సేనలు: ముప్పులేదన్న గిలానీ
శ్రీలంకలో ఘర్షణలు: 82 మంది తీవ్రవాదులు మృతి
భారతీయ విద్యార్థులకు వీసా జారీలో పాక్ జాప్యం
చైనా: జూన్‌లో 7.1 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతిచ్చే అవకాశం
బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...