|
| బెయిల్‌పై విడుదలైన మలేషియా ప్రతిపక్ష నేత |
| కౌలాలంపూర్ (ఏజెన్సీ), 17 జులై 2008 ( 15:54 IST ) | |
మలేషియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు బుధవారం అన్వర్ ఇబ్రహీంను అరెస్టు చేశారు. గత రాత్రి పోలీసు కస్టడీలో గడిపిన అన్వర్‌కు గురువారం ఆగస్టు 18న మళ్లీ పోలీసుల ఎదుట హాజరవ్వాలనే షరుతుతో బెయిల్ మంజూరు అయింది. మలేషియాకు ఇంతకుముందు ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన అన్వర్ ఇటువంటి కేసులో అరెస్టు కావడం ఇది రెండోసారి.
దశాబ్దం క్రితం స్వలింగ సమర్కం, అవినీతి కేసుల్లో అరెస్టయిన అన్వర్ పదవి కోల్పోవడంతోపాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. మొదటి స్వలింగ సంపర్కం కేసులో ఆయనపై నేరారోపణ రుజువు కాలేదు. అయితే తాజాగా తనకు ఇంతకుముందు సహాయకుడిగా పనిచేసిన మొహమద్ సైఫుల్ బుఖారీ అజ్లాన్‌పై స్వలింగ సంపర్కారనికి పాల్పడ్డారని అన్వర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నాటకీయ పరిణామాల మధ్య అన్వర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అన్వర్ తోసిపుచ్చారు. తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి కేసుల్లో ఇరికిస్తుందని అన్వర్ ఆరోపించారు. ఇదిలా ఉంటే మలేషియా చట్టాల ప్రకారం స్వలింక సంపర్క నేరానికి పాల్పడితే 20 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|