|
| ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికానే అడ్డం |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008 ( 13:49 IST ) | |
ముషారఫ్‌ను పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్న సంగతి మరోసారి బహిర్గతమైంది. ముషారఫ్‌ను తొలగించేందుకు అమెరికాకు సర్దిచెప్పాలని, అమెరికా సుముఖత వ్యక్తం చేస్తే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు మార్గం సుగమం అవుతుందని పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పాక్ పీపుల్స్ పార్టీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నట్టు తెలిసింది.
సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అయిన పీఎంఎల్- ఎన్ అధినేత, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుష్ యంత్రాంగానికి సర్దిచెప్పాలని జర్దారీ కోరుకుంటున్నారని పాక్‌కు చెందిన ది న్యూస్ వార్తాపత్రిక వెల్లడించింది. తాను షరీఫ్ కలసి అమెరికా వెళ్లి బుష్ యంత్రాంగంతో చర్చలు జరిపితే ముషారఫ్‌ను తొలగించడంపై సత్వర, ఆశించిన ఫలితాలు సాధ్యపడతాయని జర్దారీ భావిస్తున్నారు.
న్యాయమూర్తుల పునర్నియామకం, ముషారఫ్‌ను తొలగించడంపై గత కొంతకాలంగా పాక్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన పీపీపీ, పీఎంఎల్- ఎన్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారం కోసం జర్దారీ అమెరికాకు సర్దిచెప్పడమే మార్గంగా భావిస్తున్నారు.
రెండు రోజుల క్రితం నవాజ్ షరీఫ్ తాను త్వరలో న్యాయమూర్తుల పునర్నియామకం, ముషారఫ్‌ను తొలగించడానికి సంబంధించి ఇరుపార్టీల మధ్య నెలకొన్న వివాదాలపై జర్దారీతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఈ వివాదాలకు సంబంధించి పీఎంఎల్- ఎన్, పీపీపీ మధ్య జరిగే తుది చర్చలు ఇవేనని షరీఫ్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. షరీఫ్ ప్రకటనపై జర్దారీ అమెరికాకు సర్దిచెప్పాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|