|
| కుంటిసాకులతో చర్చలకు దూరమైన ఎల్టీటీఈ: రాజపక్స
|
| లండన్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008 ( 11:09 IST ) | |
శ్రీలంక ప్రభుత్వం చర్చల కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఎల్టీటీఈ నుంచి సరైన స్పందన కరువయిందని ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స విమర్శించారు. ఎల్టీటీఈపై పోరు కోసం ఆయన అంతర్జాతీయ సాయాన్ని కోరారు.
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స ఆక్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జాతుల సమస్యకు మిలటరీ పరిష్కారం చూపిస్తుందని తాను నమ్మడం లేదని చెప్పారు.
అనేకసార్లు తమ దేశంలో ఎల్టీటీఈతో చర్చల కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా మూడుసార్లు చర్చల ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎల్టీటీఈ చర్చలకు సరిగా స్పందించలేదని తెలిపారు.
ఎల్టీటీఈ ప్రతిసారి కుంటిసాకులతో చర్చలను విడిచిపెట్టిందని, తాము ఇప్పటికీ వేర్పాటువాదులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రాజపక్స చెప్పారు. ఎల్టీటీఈపై శ్రీలంక జరుపుతున్న పోరు ఆయన ఈ సందర్భంగా ప్రపంచదేశాల మద్దతు కోరారు.
ఎల్టీటీఈతో పోరులో తాము ఓడిపోయిన పక్షంలో తీవ్రవాదంపై పోరులో ప్రపంచం మొత్తం ఓడిపోయినట్లేనని రాజపక్సే పేర్కొన్నారు. ఎల్టీటీఈని ప్రపంచంలోని అత్యంత కిరాతకమైన తీవ్రవాద సంస్థగా రాజపక్స వర్ణించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|