యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనా భూకంపం: 20 వేలకు పెరిగిన మృతుల సంఖ్య
బీజింగ్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008   ( 09:49 IST )
నైరుతీ చైనాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది. ఇప్పటికీ వేలాది మంది శిధిలాల కింద లేదా ఆచూకీ తెలియకుండా ఉన్నట్టు చైనా అధికారులు తెలిపారు. దీంతో చైనా ప్రభుత్వం భూకంప సహాయ కార్యక్రమాల కోసం మరిన్ని దళాలను సిచౌన్ ప్రావీన్స్‌కు పంపింది.

ఇప్పటికే సహాయక బృందాలు భూకంపం కేంద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు చేరుకున్నారని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఒక్క మియాన్‌యాంగ్ నగరంలోనే మృతుల సంఖ్య 3629 నుంచి 5540కి చేరింది. దీంతో మృతుల సంఖ్య 18,486కు చేరిందని, 1396 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వ మీడియా వెల్లించింది.

భూకంప కేంద్రం ఉన్న వెన్‌చౌన్ కౌంటీలోని యింగ్‌జూ పట్టణంలో సుమారు 10 వేల మంది నివసింస్తుండగా వారిలో 2300 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు భావిస్తున్నారు. ఇంతకుముందు చైనా ప్రభుత్వం ఈ భూకంపంలో 12 వేల మంది మరణించారని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెన్‌చౌన్‌లోని మిగిలిన పట్టణాలకు సహాయక బృందాలు చేరుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని, భూకంప కేంద్రానికి పక్కనే ఉన్న కొన్ని పట్టణాలు పూర్తిగా శిధిలం అయ్యాయని ఓ పోలీసు అధికారి చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువాతో చెప్పారు. ఇప్పటికే భూకంప బాధిత ప్రాంతాల్లో 20 వేల మంది సైనికులు సహాయకార్యక్రమాల్లో పాల్గొంటుండగా, చైనా ప్రభుత్వం మరో 30 వేల మందిని అక్కడకు పంపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సరబ్‌ శిక్షను యావజ్జీవంగా మార్చేందుకు పాక్ విముఖత
వర్జీనియా ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం
బీజింగ్ ఒలింపిక్స్‌పై భూకంప ప్రభావం ఉండదు: చైనా
జైపూర్‌లో బాంబు పేలుళ్లు: ప్రపంచ దేశాల ఖండన
పీపీపీ ప్రజాప్రతినిధులతో అసిఫ్ అలీ జర్దారీ సమావేశం
చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...