|
| సరబ్ శిక్షను యావజ్జీవంగా మార్చేందుకు పాక్ విముఖత
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 14 మే 2008 ( 15:16 IST ) | |
పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్‌జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చడం దేశంలో అరాచకాలను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది దేశ విధానాలకు వ్యతిరేకమని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శిక్షలను మార్చే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారని అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.
పాక్‌లో ఖైదీలందరి మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చాలని కోరుతూ కొత్త ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరబ్‌జీత్ కేసును కూడా పరిశీలించారు.
ఇందులో పాక్ విదేశాంగ శాఖ, అంతర్గత, న్యాయ, మానవహక్కుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతర్గత వ్యవహారాల అంతర్గత వ్యవహారాల అదనపు కార్యదర్శి జఫీర్ అబ్బాసీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|