యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
వర్జీనియా ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం
వాష్టింగన్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 11:30 IST )
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ పశ్చిమ వర్జీనియా ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి బరాక్ ఒబామాపై విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం హిల్లరీ, ఒబామా హోరాహోరీగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.

పశ్చిమ వర్జీనియా ప్రైమరీ ఎన్నికల్లో విజయం అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి హిల్లరీ మాట్లాడుతూ అభ్యర్థి ఎన్నికల రేసు ఇంకా ముగియలేదన్నారు. ఈ అభ్యర్థి ఎన్నికల్లో విజయంపై హిల్లరీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నవంబర్ 2008 ఎన్నికల్లో ముందుకు నడిపించే సామర్థ్యం తనకే ఉందన్నారు.

జనవరి 2009లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమర్థవంతమైన వ్యక్తిని కూడా తానేనని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. పశ్చిమ వర్జీనియా ఎన్నికల్లో క్లింటన్‌కు 72 శాతం ఓట్లు లభించగా, డెమొక్టాట్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మరో అధ్యక్ష అభ్యర్థి బరాక్ ఒబామా 23 శాతం ఓట్లు మాత్రమే పొందారు.

తాజాగా పశ్చిమ వర్జీనియా ఎన్నికల్లో విజయం సాధించిన హిల్లరీ క్లింటన్ పెన్సిల్వేనియా, ఒహియో, అర్కాన్సాస్, న్యూ హాంపైర్, న్యూజెర్సీ, న్యూమెక్సికో, నెవద, మిచిగాన్, ప్లోరిడాల్లో కూడా విజయకేతనం ఎగురవేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజింగ్ ఒలింపిక్స్‌పై భూకంప ప్రభావం ఉండదు: చైనా
జైపూర్‌లో బాంబు పేలుళ్లు: ప్రపంచ దేశాల ఖండన
పీపీపీ ప్రజాప్రతినిధులతో అసిఫ్ అలీ జర్దారీ సమావేశం
చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace