|
| బీజింగ్ ఒలింపిక్స్‌పై భూకంప ప్రభావం ఉండదు: చైనా
|
| బీజింగ్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 11:14 IST ) | |
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ జ్యోతి రిలేతో పాటు ఆగస్టులో ఇక్కడ ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల ఏర్పాట్లపై ఇటీవల సంభవించిన భూకంప ప్రభావం ఉండదని నిర్వాహకులు తెలిపారు. నైరుతీ చైనాలోని సిచౌన్ ప్రావీన్స్‌లో సోమవారం సంభవించిన భూకంపంలో వేలాది మంది మృతి చెందగా, అపార ఆస్తినష్టం సంభవించింది.
ఈ నేపథ్యంలో బీజింగ్ ఒలింపిక్స్ ఏర్పాట్లపై భూకంపం ప్రభావం పడుతుందేమోనన్న ఊహాగానాలు బయలుదేరాయి. బీజింగ్ ఒలింపిక్స్‌పై ఈ భూపంకం ప్రభావం ఉండబోదని నిర్వాహకుల ప్రతినిధి ఒకరు చెప్పారు. టార్చ్ రిలే జరిగే మార్గంలో భూకంపం సంభవించిన ప్రాంతం లేదని, అందువలన టార్చ్ రిలే షెడ్యూల్ ప్రకారం సాగిపోతుందని ఆయన అన్నారు.
బీజింగ్ ఒలింపిక్స్ టార్చ్ రిలే షెడ్యూల్ ప్రకారం జూన్- 15న సిచౌన్ ప్రావీన్స్‌కు చేరుకోనుంది. ప్రావీన్స్ రాజధాని చెంగ్దులో జూన్- 18న జ్యోతి రిలే జరగాల్సి ఉంది. దీనితో పాటు ప్రావీన్స్‌లోని ఏడు నగరాల్లో కూడా జ్యోతి రిలే జరగనుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో జ్యోతి రిలే నిలిపివేయాలని తమకెటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|