|
| పీపీపీ ప్రజాప్రతినిధులతో అసిఫ్ అలీ జర్దారీ సమావేశం
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 10:50 IST ) | |
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ తన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం కానున్నారు. పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) పార్టీ మంత్రులు వైదొలిగిన సంగతి తెలిసిందే.
దేశ రాజకీయాలపై దీని ప్రభావాన్ని పరిశీలించేందుకు పీపీపీ కో- ఛైర్మన్ జర్దారీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం పీఎంఎల్- ఎన్‌కు చెందిన తొమ్మిది మంది మంత్రులు పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామాలు చేశారు.
ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను పునర్నిమయమించేందుకు పీఎంఎల్- ఎన్ పట్టుబడుతోంది. ఇందుకోసం విధించిన గడువు ఈ నెల 12తో ముగియడంతో పీఎంఎల్- ఎన్ ఛీప్ తన పార్టీ మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. పాక్ ప్రభుత్వానికి మాత్రం పీఎంఎల్- ఎన్ మద్దతున కొనసాగిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|