యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 13 మే 2008   ( 16:58 IST )
పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) పార్టీకి చెందిన తొమ్మిది మంది మంత్రులు మంగళవారం పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. పీఎంఎల్- ఎన్ మంత్రులు తొమ్మిది మంది తమ రాజీనామా లేఖలను ప్రధాని యూసఫ్ రజా గిలానీకి అందజేశారు. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేదని రెండు పార్టీలు చెబుతున్నప్పటికీ తాజా పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాల్సిందే.

న్యాయమూర్తుల పునర్నియాకంపై నెలకొన్న వివాదం పీఎంఎల్- ఎన్ మంత్రులు రాజీనామాలు చేయడానికి దారితీసింది. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను మళ్లీ నియమించడంపై పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పీపీపీ, దానికి మద్దతు ఇస్తున్న పీఎంఎల్- ఎన్‌కు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

న్యాయమూర్తుల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ముందుగా హెచ్చరించిన ప్రకారం పాక్ మంత్రివర్గం నుంచి పీఎంఎల్- ఎన్ మంత్రులు బయటకువచ్చారు. ఇదిలా ఉంటే సమస్య పరిష్కారం కోసం పీఎంఎల్- ఎన్‌తో చర్చలు కొనసాగిస్తామని మంగళవారం పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ తెలిపారు. పీఎంఎల్- ఎన్ తమను వీడిపోయే పరిస్థితి కల్పించమని జర్దారీ చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
రక్షణ, మిలటరీ సంబంధాలపై భారత్, యూఏఈ చర్చలు
పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
నైరుతి చైనా భూకంపం: 9వేలు దాటిన మృతుల సంఖ్య
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace