|
| చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
|
| బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008 ( 15:44 IST ) | |
పశ్చిమ చైనాలో భూకంపం సృష్టించిన భయానక పరిస్థితులను చెరపివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూకంపం కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను చైనా ప్రభుత్వం ముమ్మరం చేసింది.
శిధిలాల కింద ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చైనాలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా మరణించినవారి సంఖ్య మంగళవారానికి 10 వేలకు చేరుకుంది.
మృతుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. మియాన్‌ఝు అనే నగరంలోనే సుమారు 10 వేల మంది మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. ఈ భారీ భూకంపం కారణంగా నైరుతీ చైనాలో చాలాప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
భూకంపం సంభవించిన చెంగ్దు కౌంటీకి వెళ్లడం ఇప్పటికీ వీలుపడలేదు. సుమారు 20 వేల మంది చైనా భద్రతా దళ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు నగరాల్లో భవనాలు కూలిపోవడం, రోడ్లు ధ్వంసం అవడంతోపాటు భూకంపం కారణంగా అపార ఆస్తినష్టం సంభవించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|