యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 11:59 IST )
పాకిస్థాన్‌లో రెండు నెలల క్రితం ఏర్పాటయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సోమవారం మొదటి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయమూర్తుల పునర్నియామకం వివాదంపై ప్రభుత్వ భాగస్వాములైన పీపీపీ, పీఎంఎల్- ఎన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

పాక్ అధ్యక్షుడు ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను పునర్నియమించాలని పీఎంఎల్- ఎన్ గట్టిగా పట్టుబడుతోంది. మే- 12లోగా ఇది జరగకపోతే ప్రభుత్వం నుంచి తమ మంత్రులు తప్పుకుంటారని ఇప్పటికే పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ హెచ్చరించారు.

అనంతరం ఈ వివాదంపై పలుమార్లు పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీతో షరీఫ్ చర్చలు జరిపినప్పటికీ ఆయన నుంచి విస్పష్టమైన హామీ లభించలేదు. దీంతో పీఎంఎల్- ఎన్ మంత్రులు పాక్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించారు. పీఎంఎల్- ఎన్ మంత్రులందరూ మంగళవారం ప్రధాని యూసఫ్ రజా గిలానీకి రాజీనామా లేఖలు అందజేయనున్నారు.

మంత్రులు బయటకువచ్చినప్పటికీ పీపీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ విలేకరులతో చెప్పారు. మార్చి 31న ప్రమాణస్వీకారం చేసిన 24 మంది సభ్యుల కొత్త మంత్రివర్గంలో పీఎంఎల్- ఎన్ పార్టీకి తొమ్మిది మంది మంత్రులున్నారు.

ఇదిలా ఉంటే షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్)తో న్యాయమూర్తుల పునర్నియామకంపై చర్చలు కొనసాగిస్తామని పీపీపీ తెలిపింది. మంత్రివర్గం నుంచి మంత్రులను ఉపసంహరించుకున్నప్పటికీ చర్చల ద్వారా న్యాయమూర్తుల పునర్నియామకంపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని పీపీపీ చెప్పింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
నైరుతి చైనా భూకంపం: 9వేలు దాటిన మృతుల సంఖ్య
లెబనాన్‌లో ఘర్షణలు: 11 మంది మృతి
యూఏఈ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ప్రణబ్
నైరుతి చైనాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace