|
| ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది: గిలానీ
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 15:21 IST ) | |
పాకిస్థాన్‌లో ఇటీవల ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ తెలిపారు. న్యాయమూర్తుల పునర్నియామకంపై నెలకొన్న వివాదం పాక్ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీయదని నమ్మకం వ్యక్తం చేశారు.
పాక్ అధికార కూటమి కీలక భాగస్వామ్య పార్టీలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ మధ్య న్యాయమూర్తుల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదరని సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మద్దతు ఉపసంహరించదని గిలానీ పేర్కొన్నారు.
మే- 12లోగా గత ఏడాది అధ్యక్షుడు ముషారఫ్ తొలగించిన జడ్జిల పునర్నియామకం జరగాలని పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పీపీపీ చీఫ్ అసిఫ్ అలీ జర్దారీతో ఆయన జరిపిన తాజా చర్చలు కూడా విఫలం అయ్యాయి.
దీంతో రెండు నెలల క్రితం ఏర్పాటయిన పాక్ ప్రభుత్వ భవిష్యత్‌పై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ప్రధాని గిలానీ బదులిస్తూ ప్రభుత్వం పడిపోతుందని భావించడం లేదని, షరీఫ్ ఈ అంశంపై ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరించరని నమ్మకం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|