|
| బిన్ లాడెన్ పాక్‌లో లేడు: పాక్ రక్షణ మంత్రి |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 9 మే 2008 ( 15:18 IST ) | |
అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తమ సరిహద్దులో లేరని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి చౌదరీ అహ్మద్ ముక్తర్ తెలిపారు. తమ దేశంలో ఇప్పటికే తీవ్రవాద ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.
ఆఫ్గన్ సరిహద్దులోని పాక్ గిరిజన ప్రాంతాల్లో లాడెన్ దాగి ఉన్నాడని వచ్చిన మీడియా వార్తలకు సమాధానంగా ఆయన పై విధంగా స్పందించారు. అల్‌ఖైదా తీవ్రవాదులను ఖైదు చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
వారు వందల సంఖ్యలో ఉంటారని తాము భావించడం లేదని అన్నారు. అన్ని నేతలతో కలిపి వారు తక్కువ సంఖ్యలోనే ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. తీవ్రవాద పోరులో పాక్ సైన్యానికి కొన్ని సమస్యలున్నాయని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|