యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్ ప్రధాని అభ్యర్థి పేరు ఖరారు: పీపీపీ సీనియర్ నేత
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008   ( 15:40 IST )
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన సీనియర్ నేత ఒకరు బుధవారం పాక్ ప్రధాని ఎంపిక ఖరారు అయినట్లు చెప్పారు. పాకిస్థాన్ కొత్త ప్రధానిగా బాధ్యతల చేపట్టే వ్యక్తి ఎంపికపై గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఉత్కంఠ నెలకొని ఉన్న తరుణంలో పీపీపీ నేత నబీల్ గాబోల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

మరోవైపు పీపీపీ వైస్ ఛైర్మన్ మఖ్దూమ్ అమిన్ పాహిమ్ తానిప్పటికీ ప్రధాని పదవి రేసులో ఉన్నానని చెబుతున్నారు. అంతకుముందు ఫాహిమ్ సోమవారం పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ ఈ బాధ్యతలు చేపట్టడానికి అనుకూలంగా తాను ప్రధాని రేసు నుంచి తప్పుకుంటానని చెప్పారు.

పాక్ ప్రధాని అభ్యర్థి గురించి పీపీపీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదని ఫాహిమ్ తెలిపారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయాల ప్రకారం ప్రధాని అయ్యేందుకు ఫాహిమ్‌కు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. సింధ్ ప్రావీన్స్ నుంచి స్పీకర్ పదవికి అభ్యర్థిని ఎంపికచేయడంతో ఇదే ప్రావీన్స్‌కు చెందిన ఫాహిమ్ ప్రధాని కావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దీంతో ప్రధాని అభ్యర్థిని పీపీపీ పంజాబ్ ప్రావీన్స్‌ నుంచి ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వాదనలన్నింటినీ ఫాహిమ్ తోసిపుచ్చారు. పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో అధ్యక్షుడు, ప్రధానమంత్రిగా పంజాబ్ ప్రావీన్స్ వ్యక్తులే ఉన్నారని గుర్తు చేశారు.

పాక్ ప్రధాని అభ్యర్థి ఎంపికకు ఇంకా సమయం ఉందని, తొందరపడాల్సిన అవసరం లేదని ఫాహిమ్ తెలిపారు. మరోవైపు జర్దారీ సన్నిహితుడు, పీపీపీ నేత నబీల్ గాబోల్ మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిని పీపీపీ ఎంపికచేసిందని, అతడినే అందురూ ఆమోదించారని చెప్పారు. అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగుబాటు: చైనా
భద్రతా మండలి విస్తరణ: కొత్త ముసాయిదాకు తిరస్కృతి
మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక
పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
భారత్‌తో సరిహద్దు సమస్య క్లిష్టమైనది: చైనా ప్రధాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
భవిష్యత్
వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల...
ఇంకా చదవండి|మరిన్ని...