యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగుబాటు: చైనా
బీజింగ్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008   ( 15:34 IST )
టిబెట్‌ రాజధాని లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగిపోయినట్టు చైనా ప్రకటించింది. మార్చి 14న లాసాలో చెలరేగిన ఘర్షణలకు వీరంతా బాధ్యులని చైనా ప్రభుత్వం పేర్కొంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రకటనల వల్లే వీరు రెచ్చి పోయారని చైనా విమర్శించింది.

ఈ విషయమై టిబెట్ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ లాసాలో జరిగిన అల్లర్ల సందర్భంగా విధ్వంసానికి పాల్పడిన వారు లొంగిపోవడానికి గత సోమవారం రాత్రి వరకు గడువు విధించామని తెలిపారు. ఈ సమయంలో లొంగిపోయిన వారిని క్షమించి వదిలేందుకు ప్రయత్నిస్తామని, లేదంటే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రకటించినట్టు వారు చెప్పారు.

ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన కారణంగా వీరు లొంగిపోయారని వారు వివరించారు. లొంగిపోయిన వారు గొడవలు, ఆస్థులు తగలబెట్టడం, లూటీలు తదితర దుశ్చర్యల్లో పాల్గొన్నారని వారు తెలిపారు. వీరిలో కొందరు ఘర్షణల సందర్భంగా తాము లూటీ చేసిన ధనాన్ని కూడా అప్పగించారని వారు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భద్రతా మండలి విస్తరణ: కొత్త ముసాయిదాకు తిరస్కృతి
మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక
పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
భారత్‌తో సరిహద్దు సమస్య క్లిష్టమైనది: చైనా ప్రధాని
శ్రీలంకలో ఘర్షణలు: 12 మంది తీవ్రవాదులు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
భవిష్యత్
వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల...
ఇంకా చదవండి|మరిన్ని...