|
| పరిస్థితి చేయిదాటితే రాజీనామా: దలైలామా హెచ్చరిక
|
| దలైలామా (ఏజెన్సీ), 19 మార్చి 2008 ( 10:30 IST ) | |
టిబెట్ రాజధాని లాసా, పక్కనున్న ప్రావీన్స్‌ల్లో పరిస్థితి అదుపు తప్పితే తాను టిబెట్ ప్రవాస ప్రభుత్వ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని దలైలామా హెచ్చరించారు. టిబెటియన్లు శాంతియుతమార్గాల్లో పోరాడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. టిబెట్‌లో హింసాత్మక ఆందోళన జరుగుతుంటే రాజీనామా చేయడం తప్ప తనకు వేరేదారి లేదని దలైలామా పేర్కొన్నారు.
టిబెటియన్లు వారి ఆందోళనలో హింస కావాలని కోరుకుంటే నాయకత్వ బాధ్యతలకు రాజీమానా చేస్తానని 73 ఏళ్ల దలైలామా ఇక్కడ విలేకరులతో చెప్పారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాట్లాడుతూ 1987-88లో తాను ఆందోళన ప్రారంభించిన సమయంలో కూడా ప్రజలు హింసామార్గాన్ని ఎంచుకుని ఉంటే తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టే వాడిని కాదని దలైలామా తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల... |
| |
|
|
|
|
|
|
|