యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నా: ముషారఫ్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 18 మార్చి 2008   ( 16:32 IST )
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీతో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. మరోవైపు పీపీపీ నేతృత్వంలో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వం ముషారఫ్‌ను అధ్యక్ష పీఠంపై నుంచి దించివేసి నియంతృత్వానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముషారఫ్ పీపీపీ కో- ఛైర్మన్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పడం గమనార్హం. పాక్ మాజీ ప్రధానమంత్రి చౌధరి సౌజాత్ హుస్సేన్, చౌధరి పర్వేయిజ్ ఎలాహీల నేతృత్వంలోని పీఎంఎల్- క్యూ పార్టీ బృందానికి జర్దారీతో సంప్రదింపులు జరుపుతున్నానని ముషారఫ్ చెప్పినట్లు డైలీ టైమ్స్ మంగళవారం తెలిపింది.

పీఎంఎల్- క్యూ పార్టీ ప్రతినిధులు డైలీ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం రాత్రి జర్దారీతో ముషారఫ్ చర్చలు జరిపారు. ఈ చర్చల వివరాలు తెలుసుకునేందుకు పీఎంఎల్- క్యూ బృందం ముషారఫ్‌ను కలిసింది. పీపీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయితే ఎదురయ్యే పరిణామాలను పీఎంఎల్- క్యూ నేతలు ముషారఫ్‌ దృష్టికి తీసుకెళ్లారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్‌తో సరిహద్దు సమస్య క్లిష్టమైనది: చైనా ప్రధాని
శ్రీలంకలో ఘర్షణలు: 12 మంది తీవ్రవాదులు మృతి
పాక్‌లో తొలి మహిళా స్పీకర్ నియామకానికి పీపీపీ యత్నం
దలైలామాతో చర్చలకు ఇప్పటికీ మార్గాలున్నాయి: చైనా
ముషారఫ్ దిగిపోవాలి: నవాజ్ షరీఫ్ డిమాండ్
పాకిస్థాన్ ప్రధాని పదవికి జర్దారీ: ఫాహిమ్ ప్రతిపాదన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో...
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం
భవిష్యత్
వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల...
ఇంకా చదవండి|మరిన్ని...