|
| మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 240 పాయింట్ల పతనం |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 17:40 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో నడిచింది. 71 పాయింట్ల లాభంతో 14,231 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అనంతరం మళ్లీ పుంజుకున్న బీఎస్ఈ సూచి 14,405 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
ఆపై మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్‌ను ఆయిల్, గ్యాసు, బ్యాంకింగ్ వాటాల అమ్మకాలు మరింత కుంగదీశాయి. ఒకానొక దశలో సూచి 13,976 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సాయంత్రం ముగింపు సమయానికి 241 పాయింట్ల పతనంతో 14,061 వద్ద స్థిరపడింది.
ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 48 పాయింట్లు కోల్పోయి 4270 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో టాటా మోటార్స్ వాటాలు 19 శాతం, టాటా స్టీల్ వాటాలు 13 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 8 శాతం, హిందాల్కో వాటాలు 7 శాతం పుంజుకున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|