|
| ఆర్ఐఎల్‌తో ఒప్పందం: ఎన్టీపీసీకి అల్టిమేటం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 మే 2009 ( 10:16 IST ) | |
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో గ్యాసు కొనుగోలు ఒప్పందంపై ఈ వారంతంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్టీపీసీ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అల్టిమేటం జారీ చేసింది. ఆర్ఐఎల్ వద్ద గ్యాసు కొనుగోలు చేయడంపై ఈ వారంతంలోగా ఎన్టీపీసీ నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.
ఎన్టీపీసీ స్పందించేందుకు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీ గ్యాసు కేటాయింపులను ఇతర విద్యుత్ ఉత్పాదక సంస్థలకు కేటాయించనుంది. ఈ విషయాన్ని చమురు మంత్రిత్వ శాఖ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఛైర్మన్ ఆర్ఎస్ శర్మకు తెలియజేసింది.
ఆర్ఐఎల్‌కు చెందిన బంగాళాఖాతంలోని కేజీ- డీ6 క్షేత్రాల నుంచి రోజుకు 2.67 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు సరఫరా ఎన్టీపీసీకి కేటాయించబడింది. అయితే ఈ సరఫరాను అంగీకరించడంపై ఎన్టీపీసీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
చాలా ప్లాంటులు ఇంధనం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంధన కేటాయింపులు జరిగే వరకు తీవ్రంగా పోరాడిన ఎన్టీపీసీ ఇప్పటివరకు ఆర్ఐఎల్‌తో గ్యాసు కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయలేదు. దీనిపై చమురు శాఖ మే- 12న విద్యుత్ శాఖకు లేఖ రాసింది. తాజాగా ఎన్టీపీసీకి అల్టిమేటం జారీ చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|