యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపు
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 17:54 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో నడిచింది. అమెరికా మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 474 పాయింట్ల భారీ వృద్ధితో 14,758 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచి అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 13,834 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. అయితే రియాల్టీ, బ్యాంకింగ్ వాటాల కొనుగోళ్లు సెన్సెక్స్‌ను మళ్లీ లాభాల్లో నిలిపాయి.

ఈ దశలో సూచి 1,096 పాయింట్లు వృద్ధి చెంది 14,930 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. సాయంత్రం ముగింపు సమయానికి మత్రం 18 పాయింట్ల స్వల్ప లాభంతో 14,302 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) స్వల్ప నష్టాలు చవిచూసింది. నిఫ్టీ ముగింపు సమయానికి ఐదు పాయింట్లు కోల్పోయి 4318 వద్ద నిలిచింది.

మార్కెట్ లావాదేవీల్లో డీఎల్ఎఫ్ వాటాలు 19.5 శాతం, ఎస్‌బీఐ వాటాలు 11 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాటాలు 10.5 శాతం, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ వాటాలు 9 శాతం, మారుతీ సుజుకీ వాటాలు 8 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 7 శాతం, ఏసీసీ వాటాలు 6.5 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ వాటాలు 12 శాతం, విప్రో వాటాలు 9 శాతం, టీసీఎస్ వాటాలు 8 శాతం నష్టపోయాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
ఎస్సార్ ఆయిల్ నికరనష్టం రూ.455 కోట్లు
ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...