యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎల్ అండ్ టీ యూనిట్‌కు రూ.500 కోట్ల ఆర్డర్లు
ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 17:02 IST )
ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఒమన్ యూనిట్ ఆ దేశంలో రూ.518.2 కోట్ల విలువైన మూడు ఆర్డర్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి తెలియజేసింది. ఒమన్‌లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను తమ యూనిట్ సొంతం చేసుకుందని ఎల్ అండ్ టీ తెలిపింది.

ఎల్ అండ్ టీ ఇంటర్నేషనల్ ఎఫ్‌జెడ్ఈలో భాగమైన ఎల్ అండ్ టీ (ఒమన్) ఎల్ఎల్‌సీ ఈ ఆర్డర్లు పొందింది. ఒమన్‌లోని వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. దీనిని ఎల్ అండ్ టీ ఎఫ్‌జెడ్‌ఈ, ది మస్కట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎల్ఎల్‌సీలు కలిసి ఏర్పాటు చేశాయి.

రూరల్ ఎరియాస్ ఎలక్ట్రసిటీ కంపెనీ, ఒమన్ ఎలక్ట్రసిటీ ట్రాన్‌మిషన్ కంపెనీ, ఒమన్ టూరిజం డెవెలప్‌మెంట్ కంపెనీల నుంచి ఎల్ అండ్ టీ ఒమన్ ఎల్ఎల్‌సీ ఈ ఆర్డర్లు కైవసం చేసుకుంది. తాజా ప్రాజెక్టులను కంపెనీ వచ్చే 20 నెలల కాలంలో పూర్తి చేయనుందని ఎల్ అండ్ టీ వెల్లడించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
ఎస్సార్ ఆయిల్ నికరనష్టం రూ.455 కోట్లు
ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...