యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఎంటీఎన్ఎల్ ఫోన్, నెట్ కనెక్షన్ల పునరుద్ధరణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009   ( 16:55 IST )
ప్రభుత్వ రంగ మహానగర్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) మంగళవారం దేశరాజధానిలోని చాలా ప్రాంతాల్లో టెలికాం, ఇంటర్నెట్ కనెక్షన్లను పునరుద్ధరించింది. దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పునరుద్ధరించాల్సి ఉంది. మరో రెండు గంటల్లో అన్ని కనెక్షన్లు సాధారణ స్థితికి వస్తాయని ఎంటీఎన్ఎల్ తెలిపింది.

దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు మినహా, నగరవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌ను పునరుద్ధరించామని, ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రం ఢిల్లీ మొత్తం పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడ్డాయని ఎంటీఎన్ఎల్ డైరెక్టర్ కులదీప్ సింగ్ పీటీఐతో చెప్పారు. ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నానికి అన్ని కనెక్షన్లు పురుద్ధరించగలమని ధీమా వ్యక్తం చేశారు.

మళ్లీ సమస్యలు తలెత్తితే తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎంటీఎన్ఎల్ టెలికాం ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఉద్యోగాలు సోమవారం సమ్మెకు దిగిన సందర్భంగా కొన్ని కేబుళ్లను తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలో ఎంటీఎన్ఎల్ టెలికాం, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఎంటీఎన్ఎల్ ఉద్యోగులెవరూ అందుబాటులో లేరు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
ఎస్సార్ ఆయిల్ నికరనష్టం రూ.455 కోట్లు
ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా
ఉత్పాదకత, పొదుపు వృద్ధికి సహకరిస్తాయి: ఆర్‌బీఐ
జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్
సెన్సెక్స్ 2099 పాయింట్ల వృద్ధి: ట్రేడింగ్ నిలిపివేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...