|
| 4 వేల ఉద్యోగాల కోతపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి |
| న్యూయార్క్ (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 13:22 IST ) | |
అంతర్జాతీయ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అమెరికా క్రెడిట్ కార్డు దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నాలుగు వేల ఉద్యోగాలపై వేటు వేయాలని భావిస్తోంది. 800 బిలియన్ డాలర్లలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీకున్న మొత్తం ఉద్యోగాల సంఖ్యలో తొలగిస్తున్న వారి సంఖ్య ఆరు శాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టిపెట్టింది. గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో 56 శాతం నష్టం ప్రకటించిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తాజాగా ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఈ కంపెనీ గత త్రైమాసికంలో ఒక్కో వాటాపై 31 సెంట్లు నష్టపోయింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|