|
| ప్రణాళికా సంఘానికి అహ్లువాలియా రాజీనామా |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009 ( 17:41 IST ) | |
ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియాతోపాటు, ఇతర సభ్యులు సోమవారం రాజీనామా చేశారు. వీరందరూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తమ రాజీనామా లేఖలు అందజేశారు. యోజనా భవన్ వద్ద అహ్లువాలియా విలేకరులతో మాట్లాడుతూ.. తమ రాజీనామా లేఖలను ప్రధానికి అందజేసినట్లు తెలిపారు.
ప్రణాళికా సంఘంలో ఇప్పటివరకు అహ్లువాలియా డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించగా, అభిజిత్ సేన్, కిరీత్ పారీఖ్, అన్వర్ ఉల్ హోడా, వీఎల్ చోప్రా, బి ముంగేకర్, సైదా హమీద్, బీఎన్ యుగంధర్, బీకే చతుర్వేదిలు సభ్యులుగా ఉన్నారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత వీరిని ప్రణాళికా సంఘం సభ్యులుగా నియమించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|