|
| జేఎల్ఆర్ రుణాలకు హామీ ఉంటాం: బ్రిటన్ |
| లండన్ (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009 ( 13:36 IST ) | |
టాటా గ్రూపు యాజమాన్యంలోని జాగువార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) తీసుకోబోయే రుణాలకు పూచీగా ఉంటామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జేఎల్ఆర్‌ను గట్టెక్కించేందుకు టాటా గ్రూపు తీసుకోదలుస్తున్న రుణాలకు పూచీగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ విషయమే ఇప్పటికే కొన్ని యూరప్ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.
అయితే జేఎల్ఆర్ ప్రాథమిక బాధ్యత టాటా గ్రూపుపైనే ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. జేఎల్ఆర్‌కు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలపై రహస్య చర్చలు ఇప్పటికీ జరుపుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వాధికారి ఒకరు పీటీఐతో చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా బ్రిటన్ కార్ల తయారీ కంపెనీలు జాగువార్, ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|