|
| సెన్సెక్స్ 2099 పాయింట్ల వృద్ధి: ట్రేడింగ్ నిలిపివేత |
| ముంబయి (ఏజెన్సీ), 18 మే 2009 ( 13:26 IST ) | |
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం తాజా ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించగల మెజార్టీ సాధించిన ప్రభావం స్టాక్ మార్కెట్‌లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ప్రారంభమైన కాసేటికే రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచి ఈ రోజు ట్రేడింగ్‌లో 2099 పాయింట్లు వృద్ధి చెంది 14,479 పాయింట్ల వద్ద నిలిచింది.
ఆపై ఈ రోజు ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ప్రారంభమైన తొలి నిమిషంలోనే సెన్సెక్స్ 1300 పాయింట్లపైగా వృద్ధి చెంది అప్పర్ సర్క్యూట్‌ని తాకడంతో రెండు గంటలపాటు ట్రేడింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి 11.55 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమవగా సెన్సెక్స్ మరింత లాభపడి 2000 పాయింట్లకుపైగా వృద్ధి చెందింది. సూచి 20 శాతం సర్క్యూట్ బ్రేకర్‌ను తాకడంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా 20 శాతం అప్పర్ సర్క్యూట్ పరిధిని తాకింది. దీంతో రెండు మార్కెట్‌లలో ట్రేడింగ్‌ను సోమవారానికి నిలిపివేశారు. నిఫ్టీ ఈ రోజు 17.33 శాతం (636 పాయింట్లు) వృద్ధి చెంది 4308 పాయింట్ల వద్ద నిలిచింది. మార్కెట్‌లు అతి తక్కువ సమయంలో, తీవ్రస్థాయిలో పెరగడం లేదా పతనమవకుండా చూసేందుకు సర్క్యూట్ బ్రేకర్లను ఉపయోగిస్తారు.
బీఎస్ఈలో ఈ రోజు 2002 స్టాక్‌లు మాత్రమే ట్రేడ్ అవగా, నిఫ్టీలో 842 స్టాక్‌లు ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ లావాదేవీల టర్నోవర్ రూ.3,103 కోట్ల వద్ద నిలిచింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడిదారుల సంపద కొన్ని సెకన్లలోనే రూ.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదిలా ఉంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 120 పైసలు వృద్ధి చెంది రూ.48.20 వద్ద నిలిచింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|