యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
యూపీఏ విజయంతో మార్కెట్‌లో సంచలనం
ముంబయి (ఏజెన్సీ), సోమవారం, 18 మే 2009   ( 11:19 IST )
తాజా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు రంగం చేసుకుంటున్న తరుణంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఉత్సాహంతో పరుగులు పెట్టింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ భారీగా పెరిగింది.

మొదటి 60 సెకన్లలోనే బీఎస్‌ఈ సూచి 1305 పాయింట్లు పెరిగి 13,479 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా యూపీఏ విజయంతో పరుగులు పెట్టింది. నిఫ్టీ ఇదే సమయంలో 531 పాయింట్లు వృద్ధి చెంది 4,203 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రధాన రంగాలన్నీ లాభాల బాటలో ఉన్నాయి.

నిఫ్టీ, బీఎస్ఈ సూచీలు రెండూ అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో ట్రైడింగ్‌ను రెండు గంటలపాటు నిలిపివేశారు. మార్కెట్ చరిత్రలో ప్రారంభమైన తొలి నిమిషంలో అప్పర్ సర్క్యూట్‌ని తాకడం ఇదే తొలిసారి.

అప్పర్ సర్క్యూట్ నుంచి ట్రేడింగ్‌ను తిరిగి 11.55 గంటలకు ప్రారంభిస్తారు. వామపక్షాల మద్దతు లేకుండా యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామం ముందుగా ఉహించినదేనని హోంమంత్రి పి.చిదంబరం చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇన్ఫోసిస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు
20 శాతం డీలర్లకు గుడ్‌బై చెప్పనున్న జీఎం
అశోక్ లైలాండ్ నికరలాభంలో 59.5% క్షీణత
గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం ఎత్తివేత
మెక్సికోలో ప్లాంటులు మూసివేసిన జీఎం
మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 301 పాయింట్లు వృద్ధి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...