|
| ఇన్ఫోసిస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు |
| బెంగళూరు (ఏజెన్సీ), 17 మే 2009 ( 17:28 IST ) | |
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కంపెనీ మొత్తం మానవ వనరుల విలువలో ఒక్కో ఉద్యోగి వాటా ఇది. ఇన్ఫోసిస్‌లో మొత్తం మానవ వనరుల విలువ (97,349 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు, 7,501 మంది సహాయ సిబ్బంది) మార్చి 2009తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1,02,133 కోట్ల వద్ద నిలిచింది.
కంపెనీలో ఈ కాలంలో మొత్తం 1,04,850 ఉద్యోగులు పనిచేశారు. దీనిని బట్టి చూస్తే సగటున ఒక్కో ఉద్యోగి విలువ రూ.97 లక్షలు. ఇదిలా ఉంటే మార్చి 31, 2008తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో మానవ వనరుల విలువ రూ.98,821 కోట్ల వద్ద ఉంది. ఆ ఏడాది కంపెనీ ఉద్యోగుల సంఖ్య 91,187 వద్ద ఉంది. ఉద్యోగుల ద్వారా కంపెనీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయానికి ప్రస్తుత విలువ, మరికొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని మానవ వనరుల విలువను లెక్కగడతారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|