యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
20 శాతం డీలర్లకు గుడ్‌బై చెప్పనున్న జీఎం
న్యూయార్క్ (ఏజెన్సీ), ఆదివారం, 17 మే 2009   ( 16:35 IST )
ఆర్థిక మాంద్యంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ 20 శాతం మేర డీలర్లను తగ్గించుకోవాలనుకుంటుంది. డీలర్ల నెట్‌వర్క్ భారీస్థాయిలో ఉండటం వలన తీవ్రమైన అంతర్గత పోటీ నెలకొనడం, ధరలు తగ్గించేందుకు షాపర్లకు అవకాశం వస్తుండటం, భవిష్యత్ విక్రయాలు దెబ్బతింటుండటంతో జనరల్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే మరో ఆటోమొబైల్ దిగ్గజం క్రిస్లర్ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. దేశవ్యాప్తంగా డీలర్ల సంఖ్యను తగ్గించాలని క్రిస్లర్ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం కారణంగా కార్లు, ట్రక్కుల డిమాండ్ భారీగా పడిపోవడంతో ఈ రెండు ఆటోమొబైల్ దిగ్గజాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.

దీంతో ఈ రెండు కంపెనీలు 2010 చివరినాటికి వాటి డీలర్ల సంఖ్యను 1900 మేర తగ్గించాలని భావిస్తున్నాయి. వాహన అమ్మకాలు భారీగా పడిపోయి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న జనరల్ మోటార్స్, క్రిస్లర్‌లు గత కొన్ని నెలలుగా తమ మనుగడను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అశోక్ లైలాండ్ నికరలాభంలో 59.5% క్షీణత
గోధుమ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం ఎత్తివేత
మెక్సికోలో ప్లాంటులు మూసివేసిన జీఎం
మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 301 పాయింట్లు వృద్ధి
త్వరలో తేయాకు ధరలకు రెక్కలు
14ఏళ్ల తర్వాత సంస్థకు నష్టాలు: సోనీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా...
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...