|
| మెక్సికోలో ప్లాంటులు మూసివేసిన జీఎం |
| మెక్సికో సిటీ (ఏజెన్సీ), శనివారం, 16 మే 2009 ( 13:40 IST ) | |
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ మెక్సికో దేశంలో తనకున్న మూడు ప్లాంటులను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో జనరల్ మోటార్స్ మెక్సికో ప్లాంటులలో మూడింటిని మూసినట్లు మీడియా కథనం వెల్లడించింది.
అయితే ఈ నిర్ణయం దివాలా తీసేందుకు సిద్ధపడుతూ తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని జనరల్ మోటార్స్ పబ్లిక్ రిలేషన్స్ చీఫ్ (మెక్సికో) మౌరిసియో తెలిపారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనేక వారాలపాటు కొన్ని ప్లాంటులను మూసివేసింది.
తాజాగా సిలావో కాంప్లాక్స్‌ను మే 25 నుంచి జూన్ 10 వరకు, రామోస్ అరిజ్‌పే ప్లాంటును మే 18 నుంచి జూన్ 22 వరకు, శాన్ లూయిస్ పోటోసి ప్లాంటు జూన్ 1 నుంచి 12 వరకు మూసివేయనున్నట్లు మౌరిసియో వెల్లడించారు. జనరల్ మోటార్స్‌కు మెక్సికోలో ఉన్న ప్లాంటుల్లో మొత్తం 13,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 7,900 మంది ఉద్యోగులను ప్లాంటుల తాత్కాలిక మూసివేత ప్రభావితం చేయనుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|