యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
చర్చలు విఫలం: పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 9 జనవరి 2009   ( 12:23 IST )
కేంద్ర ప్రభుత్వంతో సమ్మె బాటపట్టిన చమురు కంపెనీల అధికారులు గురువారం రాత్రి జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. రెండు రోజుల క్రితం తమ వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ 14 చమురు కంపెనీలకు చెందిన సుమారు 50 వేల మంది అధికారులు సమ్మె బాటపట్టిన సంగతి తెలిసిందే.

అధికారులు తమ వేతనాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగారు. నేటితో వారి సమ్మె మూడో రోజుకు చేరుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో సమ్మె బాటపట్టిన అధికారుల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఎటువంటి ఫలితాన్నివ్వలేదని, తమ సమ్మె కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.

మరోవైపు చమురు కంపెనీల అధికారుల సమ్మె కారణంగా ఇంధన సరఫరా కుంటుబడటంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెట్రోలు బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. నిల్వలు అడుగంటిన ఫలితంగా వాటిని మూసివేశారు. శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్ సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది.

ఇదిలా ఉంటే పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో చమురు కంపెనీల అధికారులు చేపట్టిన సమ్మె కారణంగా ఏర్పడిన సమస్యలను డియోరా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఢిల్లీలోని 525 పెట్రోలు బంకుల్లో ఇంధన నిల్వలు అడుగంటడంతో మూడింట రెండొంతుల బంకులను శుక్రవారం తెరవలేదు. ముంబయిలోని 60 శాతం బంకులు "నో స్టాక్" బోర్డులు తగిలించాయి. కోల్‌కతాలోని 350 బంకుల్లో 30 శాతం బంకులు, చండీగఢ్‌లోని 80 శాతం పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి.

ఢిల్లీలో మరో ఏడు నుంచి పది రోజుల వరకు సీఎన్‌జీ, పైప్‌ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు నిల్వలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మురళీ డియోరాతో సమ్మె బాటపట్టిన అధికారుల ప్రతినిధులు గురువారం అర్ధరాత్రి నోయిడాలో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సర్థాక్ బెహ్రూయా ఈ సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు.

దేశవ్యాప్తంగా హిందూస్థాన్ పెట్రోలియం బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయి. భారత్ పెట్రోలియం తన ఆధ్వర్యంలోని బంకులకు సరఫరా సరిగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. దేశంలో అతిపెద్ద ఇంధన రీటైలర్ ఇండియన్ ఆయిల్ మాత్రం సరఫరా పూర్తిగా స్తంభించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సమ్మె నేతలను తొలగించండి: కంపెనీలకు సూచన
అమ్మకానికి సిద్ధంగా ఉన్న సత్యం: సీఈవో వెల్లడి
సత్యం కంప్యూటర్‌పై అమెరికాలో రెండు కేసులు
రెండో రోజుకు చేరుకున్న పీఎస్‌యూ అధికారుల సమ్మె
ఎయిర్‌టెల్ టెలికాం నెట్‌వర్క్‌లో భారీ రద్దీ: ట్రాయ్
సత్యంపై మాకు ఆసక్తి లేదు: ఇన్ఫోసిస్ స్పష్టీకరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...