|
| పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నాం: సీఈవో వెల్లడి |
| హైదరాబాద్ (ఏజెన్సీ), 9 జనవరి 2009 ( 09:20 IST ) | |
వ్యవస్థాపక ఛైర్మన్ బి.రామలింగరాజు కంపెనీలో చేసిన అవకతకవల కారణంగా తీవ్ర లిక్విడిటీ సమస్య ఎదుర్కొంటున్న సత్యం కంప్యూటర్ లిమిటెడ్, ప్రస్తుతం వ్యూహాత్మక పెట్టుబడిదారు కోసం అన్వేషిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ తాత్కాలిక సీఈవో రామ్ మైనంపాటి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. నగదు లభ్యతను పెంచుకునేందుకు తాము వ్యూహాత్మక పెట్టుబడిదారు కోసం వెతుకుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారులను ఎంచుకునేందుకు తాము ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
జనవరి 10న జరిగే బోర్డు సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద అవసమైన స్థాయిలో నిధులు లేవని, వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు నగదు లభ్యతను పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్లు మైనంపాటి వివరించారు. వ్యాపార కార్యకలాపాలకు ఎటువంటి నష్టం జరుగకుండా చూసేందుకు తక్షణ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|