యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
సత్యంపై మాకు ఆసక్తి లేదు: ఇన్ఫోసిస్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 జనవరి 2009   ( 12:20 IST )
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వైర్ ఎగుమతిదారు ఇన్ఫోసిస్ బుధవారం సంక్షోభంలో చిక్కుకున్న సత్యంను తాము కోనుగోలు చేయాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఇన్ఫోసిస్ కళంకిత కంపెనీల జోలికి వెళ్లబోదని కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సత్యం కొనుగోలపై తమకు ఆసక్తి లేదని, కళంకిత కంపెనీల జోలికి తాము వెళ్లమని ఆయన స్పష్టం చేశారు. భారత ఐటీ రంగంపై సత్యం సంక్షోభం ప్రభావం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఐటీ కంపెనీ, ముఖ్యంగా దిగ్గజ కంపెనీలకు కస్టమర్లతో మెరుగైన సంబంధాలు కలిగివున్నాయని చెప్పారు.

భారత ఐటీ కంపెనీల సీఈవోలు, సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు కస్టమర్ కంపెనీల యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారని తెలిపారు. ఒక కంపెనీకి చెడ్డపేరు రావడం మిగిలివాటికి నష్టం కలిగిస్తుందని తాను భావించడం లేదన్నారు. సత్యం వలన ఐటీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నారాయణ మూర్తి పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సత్యం అవకతవకలపై సీబీ- సీఐడీ విచారణ: సీఎం
సత్యం కేసును ఎస్ఎఫ్ఐవోకు అప్పగించనున్న కేంద్రం
త్వరలో ఇంధన ధరల తగ్గింపు: డియోరా
ఆర్థిక సంక్షోభం: జర్మనీ బిలియనీర్ మెర్క్లే ఆత్మహత్య
విమాన సర్వీసులపై అధికారుల సమ్మె ప్రభావం
సత్యం కంప్యూటర్ ఛైర్మన్ రామలింగరాజు రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...