|
| సత్యం అవకతవకలపై సీబీ- సీఐడీ విచారణ: సీఎం |
| హైదరాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 18:42 IST ) | |
సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో జరిగిన అవకతవకలపై సీబీ- సీఐడీ విచారణ జరిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. సత్యంలో అవకతవకలు జరగడం దిగ్భ్రాంతికరమన్నారు. కంపెనీ తప్పుడు అకౌంట్లపై తమ ప్రభుత్వం సీబీ- సీఐడీ విచారణ జరిపిస్తుందని వెల్లడించారు. సత్యం సంక్షోభానికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
రామలింగరాజు ప్రకటన ప్రకారం సత్యంలో జరిగిన మోసం దిగ్భ్రాంతి పరుస్తుందన్నారు. ఖాతాల్లో అవకతవకలు జరగడం మోసమేనని వైఎస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తాజా పరిణామాలపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశముందా అనే కోణంలో పరిశీలన జరపాలని సీబీ- సీఐడీని కోరతామన్నారు.
తన సొంత ప్రకటన ఆధారంగా రాజును ఎందుకు అరెస్టు చేయకూడదని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. తాను కూడా ఇదే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తమ పరిధిలో సాధ్యమైన, అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని వైఎస్ వెల్లడించారు. సత్యంకు సంబంధించిన వివిధ సమస్యలు, ఆందోళకర అంశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తానన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|