|
| త్వరలో ఇంధన ధరల తగ్గింపు: డియోరా |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 17:11 IST ) | |
కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశంలో ఇంధన ధరలను మరోసారి తగ్గించనుందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా బుధవారం వెల్లడించారు. పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలోనూ తగ్గింపు ఉండవచ్చని ఆయన చెప్పారు.
వచ్చే రెండు, మూడు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపును ప్రకటించే అవకాశముందని డియోరా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. అయితే తగ్గింపు ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
వంట గ్యాసు ధరలపై డియోరా మాట్లాడుతూ.. సిలిండర్ అమ్మకాలపై ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని, అయినప్పటికీ సిలిండర్‌పై రూ.20-25 వరకు తగ్గింపు ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చివరిసారి డిసెంబరు- 5, 2008న ఇంధన ధరలను తగ్గించింది.
ఆ సమయంలో పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ. 2 తగ్గింపును కేంద్రం ప్రకటించింది. ఎల్‌పీజీ ధరలను మాత్రం స్థిరంగా ఉంచింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పతనమైన బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్ 50 డాలర్ల వద్ద ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|