యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఆర్థిక సంక్షోభం: జర్మనీ బిలియనీర్ మెర్క్లే ఆత్మహత్య
ఉల్మ్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 17:11 IST )
జర్మనీ బిలయనీర్ అడాల్ఫ్ మెర్క్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం మంగళవారం వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నుంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని బయటపడేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన, చివరకు ఆత్మహత్యను ఆశ్రయించారు.

ఆయన నేతృత్వంలోని కంపెనీలు ఆర్థిక సంక్షోభం కారణంగా భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వాటిలో గత కొన్నివారాలుగా అనిశ్చితి నెలకొని ఉంది. పరిస్థితిని సరిచేయలేక నిస్సహాయుడై నిలిచిన మెర్క్లే (74), ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

దక్షిణ జర్మనీలోని ఉల్మ్ పట్టణంలో సోమవారం రైలు ఢీకొనడంతో మెర్క్లే మృతి చెందారని అధికారిక వర్గాలు చెప్పాయి. ఈ ఘటనతో ఇతరులకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు జాబితా (2008)లో మెర్క్లే 94వ స్థానంలో ఉన్నారు.

సిమెంట్ తయారీ కంపెనీ హైడెల్‌బర్క్ సిమెంట్‌, జన్యు ఔషధాల తయారీ కంపెనీ రేషియోఫార్మ్‌లతోపాటు, అనేక జర్మనీ కంపెనీలు ఆయన కుటుంబ నియంత్రణలో ఉన్నాయి. అయితే గత ఏడాది కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ షేర్లపై పెట్టిన పెట్టుబడులు ఈ వ్యాపార దిగ్గజానికి పీడకల మిగిల్చాయి.

బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. మెర్క్లే కుటుంబం పెట్టుబడుల రూపంలో కొన్ని వందల మిలియన్ల యూరోలు నష్టపోయింది. ఒక్క వోక్స్‌వ్యాగన్ షేర్లపై పెట్టిన పెట్టుబడుల్లో 400 మిలియన్ యూరోల నష్టం వాటిల్లింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విమాన సర్వీసులపై అధికారుల సమ్మె ప్రభావం
సత్యం కంప్యూటర్ ఛైర్మన్ రామలింగరాజు రాజీనామా
ఒడిదుడుకులతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఎయిర్‌టెల్, రిమ్‌ల నుంచి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్‌బుక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...