|
| విమాన సర్వీసులపై అధికారుల సమ్మె ప్రభావం |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 14:57 IST ) | |
ప్రభుత్వ రంగ చమురు కంపెనీల అధికారులు చేపట్టిన సమ్మె ప్రభావం బుధవారం ఎయిర్ ఇండియా విమాన సేవలపై పడింది. ఎయిర్ ఇండియా దేశీయ విమానాల రాకపోకలు సమ్మె కారణంగా సజావుగా సాగలేదు.
నాలుగు దేశీయ విమాన సేవలు ఆలస్యమయ్యాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు చెందిన సుమారు 55 వేల మంది అధికారులు సమ్మె బాటపట్టిన సంగతి తెలిసిందే.
ఈ కారణంగా విమానాల రాకపోకలు 25 నుంచి 30 నిమిషాలపాటు ఆలస్యమయ్యాయి. ఇదిలా ఉంటే ముంబయి అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఇక్కడి రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని చెప్పారు.
మరోవైపు సమ్మె ప్రభావం పడకుండా తమ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. తాజా పరిస్థితిని నిశితంగా ప్రర్యవేక్షిస్తున్నామని విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. ప్రస్తుతానికి సమ్మె ప్రభావం తమపై పడుతుందని భావించడం లేదు. తమ విమానాలన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్లు కింగ్‌ఫిషర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|