యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
సత్యం కంప్యూటర్ ఛైర్మన్ రామలింగరాజు రాజీనామా
హైదరాబాద్ (ఏజెన్సీ), 7 జనవరి 2009   ( 13:28 IST )
సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్ రామలింగరాజు బుధవారం కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. తన కుటంబసభ్యులకు చెందిన మైటాస్ కంపెనీలను సత్యం కొనుగోలు చేయనున్నట్లు చేసిన ప్రకటనపై వివాదం చెలరేగడం, తదనంతర పరిణామాలు కూడా వివాదాస్పదంగానే మారడంతో రామలింగరాజు గత కొన్నిరోజులుగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు.

వీటన్నింటికీ ముగింపు పలుకుతూ బుధవారం సత్యం బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బోర్డుకు రాసిన లేఖలో రూ.5040 కోట్ల కల్పిత నిల్వ నిధులు చూపించేందుకు కంపెనీ బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలు జరిగాయని ఆయన అంగీకరించారు. కంపెనీ రికార్డుల్లోని వాస్తవ పరిస్థితుల గురించి మరే ఇతర బోర్డు సభ్యునికి తెలియకపోవడం గమనార్హం.

అవకతవకలను సరిచేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని రాజు చెప్పారు. ఇదిలా ఉంటే కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో రూ.2700 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. ఇందులో రూ.2112 కోట్లు వాస్తవ ఆదాయంకాగా, కృత్రిమ ఆదాయం రూ.588 కోట్లు.

ఈ పరిస్థితుల్లో తాను కంపెనీ బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు, బోర్డు విస్తరణ జరిగే వరకు మాత్రమే ఈ బాధ్యతల్లో కొనసాగుతానని రాజు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో జరిగే బోర్డు విస్తరణ వరకు తాను బోర్డు ఛైర్మన్‌గా ఉంటానని చెప్పారు.

ఒకవైపు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కొనుగోలుపై అనేక బ్యాంకులు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజు రాజీనామా వార్త బయటకురావడం గమనార్హం. తాజా పరిణామంతో సత్యం షేరు 54 శాతం పతనమై, రూ.83కి పడిపోయింది. తమతో డీఎస్‌పీ మెరిల్ లించ్ సంబంధాలు తెంచుకున్నట్లు సత్యం బీఎస్‌ఈకి తెలియజేసింది.

తన కుమారుడి నేతృత్వంలోని మైటాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైటాస్ ప్రాపర్టీస్ కంపెనీలను సత్యం కొనుగోలు చేయనుందని రామలింగరాజు చేసిన ప్రకటనకు కొన్ని రోజుల క్రితం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ వివాదం కంపెనీని క్రమంగా సంక్షోభంలోకి నెట్టింది. తాజా సంక్షోభం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకు జనవరి 10న బోర్డు సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో బోర్డు పునఃనిర్మాణం, కంపెనీ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒడిదుడుకులతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఎయిర్‌టెల్, రిమ్‌ల నుంచి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్‌బుక్
ఉద్యోగులను తొలగించనున్న లాగిటెక్ సంస్థ
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...