యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ఒడిదుడుకులతో ముగిసిన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ మంగళవారం ఒడిదుడుకుల మధ్య ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 10,336 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 3,113 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన మిశ్రమ ఫలితాల కారణంగా ఉదయం 18 పాయింట్ల నష్టంతో 10,258 వద్ద ఇండెక్స్ ప్రారంభమైంది.

అయితే మధ్యాహ్నం జరిగిన ట్రేడింగుల్లో ఇండెక్స్ పుంజుకున్నట్లే కనిపించి వెంటనే రెడ్ మార్కులోకి ప్రవేశించింది. దీంతో 235 పాయింట్లు కోల్పోయి 10,151 వద్దకు పడిపోయింది. ఆలస్యంగా సాగిన కొనగోళ్లతో ఇండెక్స్ చివరలో మళ్లీ పుంజుకుంది. ఈ దశలో 241 పాయింట్లు గరిష్ఠంగా పుంజుకుని ఇండెక్స్ 10,392 వద్దకు చేరింది.

సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,606 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా, 1,271 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 1,244 కంపెనీల వాటాలు లాభపడగా.. మిగిలిన 91 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.

లాభపడ్డ కంపెనీ
గ్రాసిం, ఏసీసీ, జైప్రకాశ్ అసోసియేట్స్, సత్యం, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టెరిలైట్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బీహెచ్‌ఈఎల్, రాన్‌బాక్సీ, హిందుస్థాన్ యునిలివర్ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.

నష్టాలను చవిచూసిన కంపెనీలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్, డీఎల్ఎఫ్, భారతి ఎయిర్‌టెల్, టాటా పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, టీసీఎస్ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎయిర్‌టెల్, రిమ్‌ల నుంచి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్‌బుక్
ఉద్యోగులను తొలగించనున్న లాగిటెక్ సంస్థ
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
వొడాఫోన్ నుంచి వినియోగదారులకు కొత్త ఆఫర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...