|
| ఉద్యోగులను తొలగించనున్న లాగిటెక్ సంస్థ |
కంప్యూటర్ మౌస్‌లు, వెబ్‌కామ్‌లు, ఇతర కంప్యూటర్ పరికరాలను తయారీ చేసే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ లాగిటెక్ ఇంటర్నేషనల్ ఉద్యోగులను తొలగించనుంది. డిసెంబర్‌లో భారీగా వినియోగదారుల డిమాండ్ తగ్గడంతో 15 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని లాగిటెక్ సంస్థ నిర్ణయం తీసుకుంది.
2009 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన అంచనాలను విక్రయాల వృద్ధి 6 నుంచి 8 శాతం మరియు ఆదాయ వృద్ధి 3 నుంచి 5 శాతం మేరకు కంపెనీ వెనక్కు తీసుకుంది. దీనిపై లాగిటెక్ సంస్థ అధ్యక్షుడు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గెరాల్డ్ పీ క్విండ్లెన్ మాట్లాడుతూ, డిసెంబర్‌లో రిటైల్ విక్రయాలు చాలా వరకు పడిపోయాయన్నారు.
రానున్న నెలల్లో ఆర్థిక వాతావరణం మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని తాము అంచనా వేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలను తాము చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులను తొలగించాలనే అలోచనలో ఉన్నామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|