|
| స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ |
| ముంబయి (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009 ( 16:48 IST ) | |
ముంబయి స్టాక్‌మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. ఈ నేపధ్యంలో మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 10,276 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్‌మార్కెట్‌లో సోమవారం మొత్తం 2,613 సంస్థల వాటాలకు ట్రేడింగ్ జరుగగా అందులో 1,680 సంస్థల వాటాలు లాభాన్ని సాధించగా 859 సంస్థల వాటాలు నష్టాన్ని చవిచూశాయి. మిగిలిన సంస్థల వాటాలు స్థిరంగా నిలిచాయి.
టాటా పవర్ వాటాలు 7.5 శాతం లాభాన్ని సాధించగా టాటా స్టీల్, ఓఎన్జీసీ, రిలయన్స్ వాటాలు 6.5 శాతం మేర వృద్ధి సాధించాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలు 6 శాతం, రిలయన్స్ ఇన్ఫాస్ట్రక్చర్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ కమ్యునికేషన్స్ వాటాలు 5.5 శాతం లాభాన్ని సాధించాయి.
వీటితోపాటు హిండాల్కో, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ వాటాలు 4 శాతం వరకు లాభాన్ని ఆర్జించాయి. అదేసమయంలో సత్యం వాటాలు 6 శాతం నష్టాన్ని పొందగా భారతీ ఎయిర్‌టెల్ వాటాలు 2.8 శాతం, ఎన్టీపీసీ, డీఎల్ఎఫ్, హిందుస్థాన్ యునీలీవర్ వాటాలు 1.5 శాతం మేర నష్టాన్ని చవిచూశాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|