|
| సహాయ ప్యాకేజీ ప్రకటనకు రంగం సిద్ధం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008 ( 13:05 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని భారత్‌పై తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక, ద్రవ్య ప్యాకేజీ ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన శనివారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. గృహనిర్మాణ రంగానికి, ఆటోమొబైల్, ఎగుమతుల రంగాలకు ప్రయోజనకరంగా సహాయ ప్యాకేజీలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా మౌలిక రంగానికి రూ.15 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించనుంది.
ఈ ప్యాకేజీలో రూ.2000 కోట్లను ఎగుమతులు రంగానికి కేటాయించే అవకాశం ఉంది. కమర్షియల్ వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు, గృహ, ఆటో రుణాలకు ద్రవ్య లభ్యతను పెంచడం వంటి నిర్ణయాలను కూడా కేంద్రం ప్రకటించనుంది. గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు వీలుగా, రిజర్వు బ్యాంకు స్వల్పకాలిక రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|