యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరిన ముడిచమురు ధర
సింగపూర్ (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 12:23 IST )
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర గురువారం నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడిచమురు పీపా ధర తాజాగా 46 డాలర్లకు చేరుకుంది. డిమాండ్ తగ్గిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లలో ముడిచమురు ధర వరుసగా నాలుగో రోజు కూడా పతనమవుతోంది.

ఈ ఏడాది జులైలో ముడిచమురు పీపా ధర 147.27 డాలర్లకు చేరి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ముడిచమురు ధర క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటివరకు ముడిచమురు బ్యారెల్ ధర వంద డాలర్ల మేర పతనమవడం గమనార్హం. గత వారమే 16 శాతం పతనాన్ని చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

గురువారం అమెరికా లైట్ క్రూడ్ జనవరి వాటా ధర 83 సెంట్లు పడిపోయి, బ్యారెల్ 45.96 డాలర్లకు చేరింది. ముడిచమురు బ్యారెల్ ధర ఈ స్థాయికి పడిపోవడం ఫిబ్రవరి 10, 2005 తరువాత ఇదే తొలిసారి. బుధవారం కూడా పతనమైన ముడిచమురు ధర 17 సెంట్లు నష్టపోయి 46.79 డాలర్ల వద్ద నిలిచింది. లండన్ బ్రెంట్ క్రూడ్ ధర 34 సెంట్ల పతనంతో 45.10 డాలర్ల వద్ద నిలిచింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారీ సాయం కోరిన అమెరికా ఆటో దిగ్గజాలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 27 పాయింట్ల పతనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4280 కొత్త ఉద్యోగాలు
అమెరికా నవంబరు వాహన విక్రయాల్లో భారీ క్షీణత
థాయ్‌లో అశాంతి: ఏషియాన్ సదస్సు వాయిదా
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...