|
| నష్టాల బాటలో సెన్సెక్స్: 27 పాయింట్ల పతనం |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 16:21 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం స్వల్ప నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో 112 పాయింట్లు వృద్ధి చెంది 8,851 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం ఒకానొక దశలో 8,855 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం లాభాలను నిలుపుకోలేక సెన్సెక్స్ మళ్లీ నష్టాల బాట పట్టింది.
తరువాత గరిష్ట స్థాయి నుంచి 254 పాయింట్లు పతనమై 8,601 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సాయంత్రం ముగింపు సమయానికి బీఎస్ఈ సూచి 27 పాయింట్ల స్వల్ప నష్టంతో 8,712 వద్ద నిలిచింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు స్వల్ప నష్టాలను చవిచూసింది. నిఫ్టీ ముగింపు సమయానికి ఏడు పాయింట్లు కోల్పోయి 2651 వద్ద స్థిరపడింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|