యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4280 కొత్త ఉద్యోగాలు
బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 13:56 IST )
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‍బీఐ) తన అనుబంధ బ్యాంకుల కోసం కొత్తగా 4280 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మంగళవారం ఒక బహిరంగ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కొత్తగా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించే యోచన ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ఎస్‌బీఐ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం.

తన అనుబంధ బ్యాంకుల కోసం దేశవ్యాప్తంగా 4280 క్లర్క్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఎస్‌‍బీఐ వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, ఎస్‌బీఐ కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంపై దృష్టి పెట్టింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌ల కోసం ఎస్‌బీఐ కొత్త ఉద్యోగాలు ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాల్లో ఒక్కోదానిలో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మిగిలిన బ్యాంకుల్లో 240 నుంచి 440 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమెరికా నవంబరు వాహన విక్రయాల్లో భారీ క్షీణత
థాయ్‌లో అశాంతి: ఏషియాన్ సదస్సు వాయిదా
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజి
నష్టాల బాటలో సెన్సెక్స్: 82 పాయింట్ల పతనం
లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 లాభం
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ బ్యాంకు దృష్టి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...