|
| అమెరికా నవంబరు వాహన విక్రయాల్లో భారీ క్షీణత |
| న్యూయార్క్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 13:46 IST ) | |
అమెరికా వాహన విక్రయాలు గత నెలలో భారీగా క్షీణించాయి. అమెరికాలో వాహన విక్రయాల్లో 37 శాతం క్షీణత నమోదవడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి. మంగళవారం అమెరికా ఆటోమొబైల్ దిగ్గజాలు ప్రకటించిన వాహన విక్రయా ఫలితాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. టయోటా వాహన విక్రయాలు ఈ నెలలో 34 శాతం క్షీణించాయి.
మరోవైపు నిస్సాన్ విక్రయాలు 42 శాతం పతనమవగా, హోండా విక్రయాల్లో 32 శాతం క్షీణత నమోదయింది. అమెరికా ఆటోడేటా కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో నవంబరు నెలలో వాహన విక్రయాలు 746,789కి పడిపోయాయి. అక్టోబరు 1982 తరువాత వాహన విక్రయాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.
ఆర్థికమాంద్యం, వాహనాల ఫైనాన్సింగ్‌కు అతితక్కువ అవకాశాలు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు కూడా వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. దీనికి తోడు అనేక మందిని ఉద్యోగాలు పోతాయనే భయం కూడా వెంటాడుతుంది. ఈ కారణాలతో వాహన విక్రయాలు బాగా తగ్గిపోతున్నాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|