యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
థాయ్‌లో అశాంతి: ఏషియాన్ సదస్సు వాయిదా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 11:36 IST )
థాయ్‌లాండ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నెల 17న జరగాల్సిన ఇండియా- ఏషియాన్ సదస్సు వాయిదా పడింది. గత కొన్ని నెలలుగా థాయ్‌లాండ్ రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబరు 17న జరగాల్సిన ఇండియా- ఏషియాన్ సదస్సును తాము షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేమని థాయ్‌లాండ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

థాయ్ దౌత్యాధికారి ఈ మేరకు మంగళవారం తమకు వివరాలు తెలియజేశారని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు. ఈ సదస్సులో పది ఆసియా దేశాలు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా పాల్గొననున్నారు. అయితే దేశంలో అశాంతి నెలకొని ఉన్న కారణంగా సదస్సును వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు థాయ్‌లాండ్ అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజి
నష్టాల బాటలో సెన్సెక్స్: 82 పాయింట్ల పతనం
లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 లాభం
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడరల్ బ్యాంకు దృష్టి
నవంబరులో భారీగా తగ్గిన వాహన అమ్మకాలు
అధికారికంగా తిరోగమన బాటలో అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...