|
| లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 లాభం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 14:53 IST ) | |
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.15 వరకు, డీజిల్ అమ్మకంపై రూ.3 లాభం పొందుతున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు గత మూడేళ్లలో మొదటిసారి చమురు ధరలు కిందకు పడిపోతుండటంతో, దేశంలో ఇంధన విక్రయాలపై లాభాలు గడిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
గత వారం వరకు ఈ మూడు కంపెనీల లాభావకాశాలు పెట్రోల్‌కు రూ.9.86, డీజిల్ విక్రయాలపై లీటరుకు రూ.0.70 వద్ద ఉన్నాయి. అయితే ప్రస్తుతం లాభార్జన స్థాయి పెట్రోల్‌పై రూ.14.98, డీజిల్‌పై లీటరుకు రూ.3.03కి పెరిగింది. అయితే ఈ చమురు కంపెనీలు ఇప్పటికీ కిరోసిన్ అమ్మకాలపై లీటరుకు రూ.17.26 నష్టపోతున్నాయి. అదేవిధంగా 14.2- కేజీల గ్యాసు సిలిండర్ అమ్మకాలపై రూ.148.32 నష్టపోతున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|