|
| కోలుకున్న మార్కెట్: సెన్సెక్స్ 464 పాయింట్ల వృద్ధి |
| ముంబయి (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:52 IST ) | |
వరుసగా ఏడు రోజులు నష్టాల బాటలో నడిచిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈ రోజు దారి మళ్లింది. నాలుగు పాయింట్ల నష్టంతో 8,447 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల వాటాల కొనుగోళ్లతో లాభాల బాట పట్టింది.
అయితే మధ్యలో మదుపుదార్లు లాభాలు తీసుకోవడంతో 8,442 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత కాసేపటికే మార్కెట్ కోలుకోవడంతో సెన్సెక్స్ ఒకానొక దశలో 8,988 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. సాయంత్రం ముగింపు సమయానికి 464 పాయింట్లు లాభపడి 8,915 వద్ద స్థిరపడింది.
ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల బాటలోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 87 పాయింట్లు వృద్ధి చెంది 2640 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో రిలయన్స్ ఇన్‌ఫ్రా వాటాలు 14 శాతం లాభపడ్డాయి.
స్టెర్లైట్, ఎన్టీపీసీ, మారుతీ వాటాలు 9 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాటాలు 13.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ వాటాలు 8.5 శాతం, ఎస్‌బీఐ, టీసీఎస్ వాటాలు 8 శాతం, భెల్, ఎల్ అండ్ టీ వాటాలు 7 శాతం పుంజుకున్నాయి. డీఎల్ఎఫ్ వాటాలు 3.4 శాతం నష్టపోయాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|